బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (13:53 IST)

ఏపీలో గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమ్మె సైరన్

andhrapradesh logo
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. మొత్తం 9 ప్రధాన డిమాండ్లతో వారు సమ్మె నోటీసు ఇచ్చారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో వచ్చేనెల రెండో తేదీ అంటే గాంధీ జయంతి రోజు నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని వారు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా, గ్రామ పంచాయతీ ఉద్యోగుల కనీస వేతనం రూ.20 వేలుగా నిర్ణయించాలన్నది వారి ప్రధాన డిమాండ్లలో ఒకటిగా వుంది. 
 
అలాగే, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు, గ్రీన్ అంబాసిడర్‌లకు కనీస వేతనం ఇవ్వాలని కోరింది. కనీస వేతనంగా రూ.20 వేలు చెల్లించాల్సిన డిమాండ్ చేసింది. నెలకు రూ.6 వేలు చొప్పున అక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని కోరింది. 
 
ముఖ్యంగా, పంచాయతీ కార్మికలను తొలగించడాన్ని తక్షణమే నిలిపి వేయాలని, ఉద్యోగ భద్రతను కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను అందించాలని ఉద్యోగుల సంఘం కోరింది.