ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 20 మే 2024 (18:47 IST)

ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించిన రిలయన్స్ రిటైల్ యూస్టా: ప్రారంభించిన నటి శ్రీలీల

Sreeleela
రిలయన్స్ రిటైల్ యూత్ సెంట్రిక్ బ్రాండ్ అయినటువంటి యూస్టా... దక్షిణ భారతదేశంలో తనదైన ముద్ర వేసేలా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఎక్కడికక్కడ సరికొత్త స్టోర్స్ ప్రారంభిస్తోంది. ఇప్పుడు తాజాగా గుంటూరు నగరంలోని అమరావతి రోడ్డులో యూస్టా సరికొత్త స్టోర్ ని ప్రారంభించింది. ఈ స్టోర్‌ని టాలీవుడ్ సన్షేషన్ శ్రీలీల ఘనంగా ప్రారంభించారు. యూస్టా స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా.. శ్రీలీల అద్భుతమైన, ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్‌ను ఆవిష్కరించింది. యూస్టా స్టోర్లో అధునాతన కలెక్షన్ అందరికి అందుబాటు ధరలో లభ్యం అవుతాయి. అన్నింటికి మించి నేటి యువత అభిరుచులకు అనుగుణంగా ఉండే, ప్రత్యేకంగా రూపొందించిన స్టైలిష్ ఫ్యాషన్-ఫార్వర్డ్ దుస్తులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
 
యూస్టా బ్రాండ్‌ను 2023 ఆగస్టు నెలలో ప్రారంభించారు. ఈ బ్రాండ్ ప్రారంభించిన దగ్గరనుంచి భారతదేశంలో మొత్తం అందరికి అందుబాటులో ఉండే విధంగా విస్తరణ చేపట్టారు. ఇప్పుడు యూస్టా స్టోర్స్... మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్ ఘడ్, కేరళ, తమిళనాడు, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ స్టోర్‌ని ప్రారంభించారు. ఈ స్టోర్స్ ఏర్పాటు యొక్క ఉద్దేశం యువతకు కావాల్సిన ఫ్యాషన్ ఫిట్స్, స్త్రీ పురుషులకు కావాల్సిన దుస్తులు, కేరక్టర్ మర్కండైజ్ అందివ్వడమే. అన్నింటికి మించి ఫ్యాషన్ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న సరికొత్త ట్రెండ్స్‌ను అనుసరించి.. ఎక్స్‌క్లూజివ్ గా “స్టార్రింగ్ నౌ” సెగ్మెంట్లో దుస్తుల్ని అందిస్తున్నారు. ఇవన్నీ రూ.999 లోపు మాత్రమే. అందులో చాలావరకు రూ.499 లోపు మాత్రమే.
 
కొత్త గుంటూరు స్టోర్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సెల్ఫ్-చెకౌట్ కౌంటర్లు, ఛార్జింగ్ స్టేషన్లు లాంటి అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వినియోగదారులకు అద్భుతమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గుంటూరులో ఏర్పాటు చేసిన యూస్టా స్టోర్‌కు ఇతర ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. కమ్యూనిటీ సస్టైనబులిటీ కింద సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే కృత నిశ్చయంతో పనిచేస్తుంది యూస్టా స్టోర్. అందులో భాగంగానే యూస్టా స్టోర్ లాభాపేక్ష లేని సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా పాత దుస్తులను విరాళంగా ఇచ్చేలా వినియోగదారులను ప్రోత్సహించేందుకు స్టోర్ సిద్ధంగా ఉంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది.