శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2020 (15:17 IST)

ఆర్ఐఎల్‌లో పెట్టుబడుల వెల్లువ.. సింగపూర్ కంపెనీ రూ.7,350 కోట్లు

Reliance
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. రిలయన్స్‌లో వరుస పెట్టుబడులు పెడుతున్న విదేశీ సంస్థల జాబితాలో మరో రెండు విదేశీ కంపెనీలు చేరాయి. తాజాగా సింగపూర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ జీఐసీ, గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్ రిలయన్స్ రిటైల్ విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయి.
 
జీఐసీ, టీపీజీ కలిపి రూ.7,350 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నాయి. ఐతే జీఐసీ రూ.5,512.5 కోట్లు పెట్టుబడి చేయనుంది. టీపీజీ రూ.1,837.5 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు రిలయన్స్ సంస్థ పేర్కొంది. 
 
తాజా పెట్టుబడుల ద్వారా రిలయన్స్ రిటైల్ వింగ్ లిమిటెడ్‌లో జీఐసీ 1.22 శాతం, టీపీజీ 0.41 శాతం ఈక్విటీ వాటాను సొంతం చేసుకోనున్నాయి. కాగా, తాజా పెట్టుబడులతో కలిపి రిలయన్స్ రిటైల్ ఇప్పటివరకు 7.28 శాతం వాటా విక్రయం ద్వారా రూ.32,197 కోట్ల పెట్టుబడులను సమకూర్చుకుంది.