సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2020 (10:27 IST)

రిలయన్స్ మరో భారీ డీల్ : రిలయన్స్ రిటైల్‌లో కేకేఆర్ పెట్టుబడులు

రిలయన్స్ ఇండస్ట్రీలో మరో భారీ డీల్ కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన ఓ కంపెనీ కేకేఆర్‌.. రిల్ అనుబంధ రిలయన్స్ రిటైల్‌లో 1.28 శాతం వాటాలను కొనుగోలు చేయడం ద్వారా రూ.5,500 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బుధవారం యూఎస్ స్టాక్ మార్కెట్‌కు తెలియజేసింది. రిలయన్స్ రిటైల్ విలువ రూ.4.21 లక్షల వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నామని సంస్థ పేర్కొంది.
 
ఇప్పటికే లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను పలు దిగ్గజ కంపెనీల నుంచి స్వీకరించింది. కాగా, రెండు నెలల క్రితం ఇదే కేకేఆర్ రిలయన్స్ జియోలో రూ.11,367 కోట్లను ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆపై ఇప్పుడు మరోమారు అదే సంస్థలో పెట్టుబడి పెట్టింది. రిలయన్స్ రిటైల్‌లో ఇటీవలే సిల్వర్ లేక్ సైతం 1.75 శాతం వాటాను గొనుగోలు చేసింది.
 
ఇక ఇండియాలో అతిపెద్ద రిటైల్ సంస్థగా అవతరించాలన్న లక్ష్యంతో రిలయన్స్ అడుగులు వేస్తుండగా, పలు కంపెనీలు వచ్చి తమవంతు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తదితర కంపెనీలను అధిగమించి, ఇండియాలో గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించాలన్న లక్ష్యంతో ముఖేశ్ అంబానీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  
 
దీనిపై కేకేఆర్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సెన్రీ క్రావిస్ స్పందిస్తూ, ఈ డీల్‌‌తో ఇండియాలో తమ ప్రాతినిధ్యం పెరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే, రిల్ అధినేత ముఖేష్ అంబానీ స్పందిస్తూ, దేశంలో రిటైల్ వ్యవస్థ అభివృద్ధి, ప్రజల ప్రయోజనాల దిశగా తమ ప్రయాణం సాగుతుందన్నారు.