రూపాయి ఢమాల్.. చరిత్రలో ఆల్‌ టైమ్ రికార్డు స్థాయికి...

Written By ఠాగూర్
Updated: గురువారం, 20 అక్టోబరు 2022 (08:36 IST)
భారత కరెన్సీ రూపాయి విలువ నానాటికీ దిగజారిపోతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ ఏకంగా 83 రూపాయలకు చేరింది. 
 
గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ ముందుకు సాగుతూ వచ్చిన రూపాయి విలువ బుధవారం మాత్రం తొలిసారిగా 83 రూపాయల దిగువకు పడిపోయి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి చేరింది. 
 
బుధవారం 82.30 వద్ద ట్రేడింగ్ ప్రారంభంకాగా, ఆ తర్వాత ఒక దశలో 82.95 రూపాయలకు పడిపోయింది. మంగళవారం నాటికి క్లోజింగ్‌తో పోలిస్తే నిన్న ఒక్క రోజే 61 పైసలు క్షీణించి 83.02 దిగువకు పడిపోయింది. రూపాయి చరిత్రలోనే 83 కిందికి పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
నిజానికి బుధవారం సెషన్ ఆరంభంలో రూపాయి సానుకూలంగానే ట్రేడ్ అయింది. అయితే ఆ తర్వాత క్రమంగా నష్టాల్లో జారుకుంది. ఇది మరింత పతనమై 83.50 దిగువకు చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
రూపాయి విలుప నానాటికీ దిగజారిపోతుండటంతో ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు వడ్డీరేట్లను పెంచడంపై భారతీయ రిజర్వు బ్యాంకు దృష్టిసారించే అవకాశం ఉందని వారు అంటున్నారు. 

అన్నీ చూడండి

Vijayashanti :చిన్న సినిమాల్లోనే దమ్ముంది, సబ్జెక్ట్ వుంది :విజయశాంతి

Sakshi Madolkar : శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా సాక్షి మడోల్కర్

Kalyanram: తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్నవెంకటేష్, కల్యాణ్ రామ్, అనిల్ రావిపూడి చిత్రం

Chennai Love Story review :గుండెల్ని పిండే ప్రేమకథగా కిరణ్ అబ్బవరం....చెన్నై లవ్ స్టోరీ రివ్యూ

Namit Malhotra :ఈ రోజు విడుదల కావాల్సిన రామాయణ ట్రైలర్ వాయిదా పడింది.

తర్వాతి కథనం
Show comments