సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 3 మే 2022 (18:16 IST)

జాబ్‌ గ్యారెంటీ ప్రచారం తరువాత లెర్నర్‌ ప్లేస్‌మెంట్‌ రేట్‌ పరంగా 75% వృద్ధి నమోదు చేసిన సింప్లీలెర్న్‌

డిజిటల్‌ ఆర్ధిక నైపుణ్యాల కోసం ప్రపంచంలో మొట్టమొదటి ఆన్‌లైన్‌ బూట్‌ క్యాంప్‌ సింప్లిలెర్న్‌, అదనపు నైపుణ్యపు స్ఫూర్తిని మరింతగా పెంపొందిస్తూ తమ తాజా జాబ్‌ గ్యారెంటీ బ్రాండ్‌ క్యాంపెయిన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా వినూత్నమైన జాజ్‌ గ్యారెంటీ ప్రోగ్రామ్స్‌ను ప్రమోట్‌ చేస్తుంది. చమత్కారంగా తీర్చిదిద్దిన ఈ ప్రచారం ప్రధానంగా క్రికెట్‌పై దృష్టి సారించింది. 2022 ఐపీఎల్‌ సీజన్‌ సమయంలో దీనిని ప్రసారం చేయనున్నారు. ఇది గతంలో అపూర్వ విజయం సాధించిన ప్రచారానికి కొనసాగింపు.

 
జనవరి, 2022లో విడుదల చేసిన జాబ్‌ గ్యారెంటీ ప్రచారం ప్రధానంగా ఓ నూతన స్థానం లేదా ఉద్యోగ బాధ్యతలలో ప్రమోషన్‌లు పొందినప్పుడు భారతీయ సాంస్కృతిక ప్రమాణాలు అయిన అడగడం లేదా విందు ఇవ్వడం పై దృష్టి సారిస్తుంది. తాజా భాగంలో సింప్లీ లెర్న్‌ యొక్క జాబ్‌ గ్యారెంటీ మినహా ఈ ప్రపంచంలో గ్యారెంటీ అనే అంశం ఏమీ లేదని వెల్లడిస్తుంది. ఈ ప్రస్తుత ప్రచారం రెండు నూతన అనుసంధానిత యాడ్‌ చిత్రాల ద్వారా యాక్టివేట్‌ చేశారు. ఈ రెండూ ప్రస్తుత క్రికెట్‌ మ్యాచ్‌లపై దృష్టి సారిస్తాయి. ప్రతి చిత్రమూ టీమ్‌ హడ్డల్స్‌- మ్యాచ్‌కు ముందు లాకర్‌ రూమ్‌, మిడ్‌ మ్యాచ్‌ డగ్‌ఔట్‌ టాక్‌ గురించి మాట్లాడతాయి.

 
సింప్లీలెర్న్‌ యొక్క ఇటీవలి మార్కెటింగ్‌ మరియు ఎడ్వర్టయిజింగ్‌ యాక్టివేషన్‌లకు గణనీయమైన రిటర్న్స్‌ వచ్చాయి. ఇవి బ్రాండ్‌ యొక్క ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటుగా తరువాత దశకు తీసుకువెళ్లాయి. ఈ జాబ్‌ గ్యారంటీ బ్రాండ్‌ ప్రచారం విడుదల తరువాత 250% గరిష్ట హైక్‌ను చేరుకుంది. అభ్యాసకులు 5000కు పైగా హైరింగ్‌ భాగస్వాముల నుంచి అవకాశాలు పొందుతున్నారు. ఈ ప్రచారం నాలుగు నెలల్లో 1000 ఎన్‌రోల్‌మెంట్స్‌కు తోడ్పాటునందించింది. ఈ జనవరి నెలలో గత ప్రచారం విడుదల చేసినప్పటి నుంచి ప్లేస్‌మెంట్స్‌ పరంగా 75% వృద్ధి కనిపించింది.

 
ఈ తాజా ప్రచార పీఠిక ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఏ ఒక్కటి గ్యారెంటీ ఇవ్వదు కానీ సింప్లీ లెర్న్‌తో ప్రతి ఒక్కరికీ జాబ్‌ గ్యారెంటీ అని తెలుసని వెల్లడిస్తుంది. ఈ యాడ్‌ ఫిల్మ్ప్‌ను ఈ నేపథ్యంతోనే చిత్రించారు, దీనిలో టీమ్‌ కెప్టెన్‌ తమ ఆటగాళ్లతో మన జీవితంలో ఏ ఒక్క దానికీ గ్యారెంటీ  ఇవ్వలేము. క్రికెట్‌లో కూడా అంతే అని చెబుతుంటాడు. ఓ ప్రకటనలో , ఓ ఆటగాడు దీనికి స్పందిస్తూ సింప్లీ లెర్న్‌ యొక్క జాబ్‌ గ్యారెంటీ ప్రోగ్రామ్‌తో  అభ్యాసకులు తమ అభ్యాసం పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం పొందగలరనే గ్యారెంటీ లభిస్తుందని వెల్లడిస్తాడు. మరో దానిలో కెప్టెన్‌ స్వయంగా ఈ పరిశీలన చేస్తాడు.

 
ఈ ప్రచారం గురించి మార్క్‌ మోరన్‌, చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌, సింప్లీ లెర్న్‌ మాట్లాడుతూ, ‘‘గత ప్రచార నేపధ్యం జాబ్‌ గ్యారెంటీ ప్రోగ్రామ్‌ అపూర్వ విజయం సాధించడంతో మేమిప్పుడు తరువాత దశ ప్రచారం ప్రారంభించడం పట్ల ఆనందంగా ఉన్నాము. దీనిని 2022 ఐపీఎల్‌ సీజన్‌ ఫీవర్‌కు అనుగుణంగా తీర్చిదిద్దాము. మా అభ్యాసకులు మా తాజా ప్రచారంతో కనెక్ట్‌ కాబడ్డారు. ఔత్సాహికులు తమంతట తాముగా అదనపు నైపుణ్యాలు పొందడం ద్వారా ఎలాంటి బాధలు లేకుండా ఉద్యోగాలు పొందవచ్చని చెబుతుంది. ఈ ప్రపంచంలో ఏ ఒక్క అంశానికీ గ్యారెంటీ లేదని, ఒక్క సింప్లీ లెర్న్‌ యొక్క జాబ్‌ గ్యారెంటీ ప్రోగ్రామ్‌లకు మాత్రమే హామీ ఉంటుందని వెల్లడిస్తుంది’’

 
ఆయనే మాట్లాడుతూ, ‘‘ తమ ప్రొఫెషనల్‌ జీవితాలలో అధికశాతం మంది అభ్యాసకులు అదనపు నైపుణ్యాలు పొందడంలో ఒత్తిడి ఎదుర్కొంటుంటారని మేము గమనించాము. వారు నూతన ఉద్యోగం పొందగలరా? నూతన నైపుణ్యాలు వారి ప్రస్తుత రోల్‌ మెరుగుపరచడంలో తోడ్పడతాయా? ఇలాంటి అతి సాధారణ సందేహాలకు, మేము జాబ్‌ గ్యారెంటీ ప్రోగ్రామ్‌లతో వారి భారం తొలగించమని కోరుతున్నాం. ఇది ఔత్సాహికులు తమ నైపుణ్యాలను ఎలాంటి కష్టం లేకుండా పొందగలరనే భరోసా అందిస్తుంది. ప్రోగ్రామ్‌ పూర్తయిన తరువాత తమ చేతిలో ఉద్యోగం ఉందనే భరోసానూ అందిస్తుంది’’ అని అన్నారు.

 
సింప్లీ లెర్న్‌ క్యాంపెయిన్‌ గురించి కార్ల్‌ సావియో, సీసీఓ, బ్లూబాట్‌ డిజిటల్‌ మాట్లాడుతూ, ‘‘ఐపీఎల్‌ ఎంత రంజుగా సాగుతుందో అదే రీతిలో మేము ఈ ప్రచారాన్ని ఒకే అంశం మొత్తమంతా చెప్పాలని భావించాం. ఈ ప్రచారాన్ని ఊహాజనిత టీమ్‌ , అత్యధిక ఒత్తిడి, ఐపీఎల్‌ వాతావరణంతో మనకంతా తెలిసిన, అభిమానించే అంశాలను గురించి తెలిపే ప్రయత్నం చేశాం’’ అని అన్నారు.

 
ఈ ప్రచారంలో అత్యధిక జనసందోహం, అత్యున్నత పోటీ కలిగిన ప్రాంతాలలో అభ్యాసకులకు సింప్లీ లెర్న్‌ యొక్క జాబ్‌ గ్యారెంటీ ప్రోగ్రామ్‌లను గురించి వివరిస్తుంది. ఈ రెండు ప్రోగ్రామ్‌లనూ డాటా సైన్స్‌ మరియు ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌లో విడుదల చేశారు. ఇవి 100% జాబ్‌ గ్యారెంటీ (షరతులు వర్తిస్తాయి)ని 180 రోజుల లోపుగా అందిస్తుందనే భరోసా అందిస్తుంది. ఈ జాబ్‌ గ్యారెంటీ మరియు మనీ బ్యాక్‌ ప్రోవిజన్‌లు సింప్లీ లెర్న్‌ యొక్క జాబ్‌ గ్యారెంటీ ప్రోగ్రామ్‌ను ఎవరైనా సరే తమ కెరీర్‌లను అత్యున్నత వృద్ధి కలిగిన ప్రొఫెషనల్‌ ఫీల్డ్స్‌లో పొందగలదనే ధైర్యం అందిస్తుంది. సింప్లీ లెర్న్‌ ఈ ఇంటిగ్రేటెడ్‌ ప్రచారాన్ని బహుళ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ వ్యాప్తంగా అందిస్తుంది.