గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 27 అక్టోబరు 2023 (16:56 IST)

నందన్ నీలేకని నేతృత్వంలోని ఏక్‌స్టెప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశంలో మొట్టమొదటి ఓపెన్ నెట్‌వర్క్

Nandan
ఏక్‌స్టెప్ ఫౌండేషన్ (EkStep) ఈ రోజు దేశం యొక్క మొట్టమొదటి ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనే నెట్‌వర్క్‌ను ప్రకటించింది. ఇది, ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ మద్దతుతో మరియు ఏక్‌స్టెప్ ఫౌండేషన్ ద్వారా ఇంక్యుబేట్ చేయబడింది. ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, ప్రొటీన్, డిజిటల్ ఎకానమీలో ఫౌండేషన్ ఫర్ ఇంటర్‌ఆపరబిలిటీ ఇన్ డిజిటల్ ఎకానమీ వంటి వాటితో సహా వివిధ భాగస్వాములతో ఏర్పడిన ఈ నెట్ వర్క్, మిలియన్ల మంది విద్యార్థులు నిపుణులు మరియు ఉద్యోగ అన్వేషకుల అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలని సులభతరం చేయాలని భావిస్తోంది. 
 
ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్, సెంటర్ ఫర్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫిక్కీ, యస్.పి. జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ వంటి వాటితో పాటు ఫ్రొతేన్ విద్యసారథి, బడ్డి4స్టడి, బేటర్ ప్లేస్ మరియు నమ్మ యాత్రి వంటి దిగ్గజాలు ఈ నెట్‌వర్క్ భాగస్వాములుగా ఇప్పటికే ఉండగా, యూనిసెఫ్ వంటి వంద కంటే ఎక్కువ ప్రముఖ సంస్థలు నెట్‌వర్క్‌లో చేరడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి.
 
భారతదేశంలో ప్రతి నెలా ఒక మిలియన్ మంది ప్రజలు 18 సంవత్సరాల వయస్సుకు చేరుకుంటున్నారు, సంవత్సరానికి ఐదు మిలియన్ల గ్రాడ్యుయేట్లు భారతీయ వర్క్‌ఫోర్స్‌లో చేరుతున్నారు. దేశంలోని 18 మరియు 35 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు 600 మిలియన్ల మంది జనాభా ఉన్నందున, మన జాతీయ మరియు ప్రపంచ ఆకాంక్షలను సాధించడంలో మానవ సామర్థ్యాల అభివృద్ధి కీలకం అవుతుంది. 
 
ఈ సందర్భంగా ఏక్‌స్టెప్ ఫౌండేషన్ చైర్మన్ మరియు UIDAI వ్యవస్థాపక చైర్మన్ నందన్ నీలేకని ఇలా అభిప్రాయపడ్డారు, "ప్రజలకు, ముఖ్యంగా యువతకు సహాయకారిగా ఉండి, దేశానికి ప్రయోజనాన్ని సృష్టించేందుకు డిజిటల్ క్యాపిటల్ శక్తిని మానవ శక్తితో కలపాలి. డిజిటల్ శక్తిని ఉపయోగించు కోవడం మరియు దానికి అనుగుణంగా ప్రజలను సిద్ధం చేయడంపై మనం దృష్టి సారించాలి. వందల మిలియన్ల మంది భారతీయుల నైపుణ్యం మరియు విద్యను సులభతరం చేయడం కోసం సమాజానికి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను తీసుకురావడానికి ఉపయోగపడే ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ను ప్రారంభించటం మా ప్రయత్నంలో ఒక భాగం. 
 
ఏక్‌స్టెప్ ఫౌండేషన్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ, "ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది విద్య మరియు నైపుణ్యం లకు యూపిఐ లాంటింది. యువతకు వివిధ సంస్ధల ద్వారా అందే ప్రయోజనాలను, కోర్సులను, అందిస్తున్న నైపుణ్య అభివృద్ధి కోర్సులను, ఉద్యోగ అవకాశాలను "ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్" ద్వారా అందిపుచ్చుకోవచ్చు. దీని  ద్వారా కాలయాపనలు, ఘర్షణలను తగ్గించడం మరియు 100పైగా సంస్ధల నెట్‌వర్క్ ప్లాట్‌ఫారమ్‌ల కలయిక శక్తిని ఒకచోట చేర్చడం దేశంలోని ప్రతి మూల మూలలో నేర్చుకోవడం మరియు జీవనోపాధి అవకాశాలను ప్రారంభించడానికి ఒక మార్గం" అని అన్నారు.