సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 జూన్ 2023 (17:06 IST)

చదువు చెప్పిన విద్యా సంస్థకు రూ.315 కోట్ల విరాళం... ఎవరు?

nandan nilekani
తాను చదువుకున్న విద్యా సంస్థకు ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని భూరి విరాళం ఇచ్చారు. బాంబే ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి ఆయన రూ.315 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ విద్యా సంస్థతో తన అనుబంధం 50 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విరాళాన్ని ఆయన ప్రకటించారు. ఈయన 1973లో బాంబే ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీలో చేరారు. ఇప్పటికీ 50 యేళ్లు పూర్తయ్యాయి. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, "బాంబే ఐఐటీ నా జీవితానికి మూలస్తంభం వంటిది. నా జీవితానికి పునాది అక్కడే పడింది. అందుకే సంస్థతో నా 50 ఏళ్ల అనుబంధాన్ని పురస్కరించుకొని నా వంతు సహకారం అందిస్తున్నాను. సంస్థకు భవిష్యత్తులోనూ నా సహకారం ఉంటుంది. ఇది కేవలం ఆర్థికం సహాయం కాదు. నాకు జీవితం ఎంతో ఇచ్చిన సంస్థ పట్ల నాకున్న గౌరవం. రేపటి ప్రపంచాన్ని తీర్చిదిద్దనున్న విద్యార్థుల పట్ల నిబద్ధత" అని నందన్ పేర్కొన్నారు. 
 
ఆయన ఇచ్చిన ఈ విరాళంలో సంస్థలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనకు, పరిశోధనలకు, టెక్ స్టార్టప్ పర్యావరణాన్ని అభివృద్ధి చేయడానికి వినియోగించనున్నారు. కాగా, గతంలోనూ ఆయన ఐఐటీ బాంబేకు రూ.85 కోట్లు విరాళంగా ఇచ్చారు. కేవలం ఆర్థికంగా అండగా ఉండడమే కాకుండా ఈ యాభై ఏళ్లలో పలు హోదాల్లో సంస్థతో ఆయన అనుసంధానమయ్యే ఉన్నారు.