ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 25 అక్టోబరు 2023 (14:14 IST)

ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు లక్ష కోట్ల పన్ను

gstimage
పన్ను ఎగవేతకు సంబంధించి ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీల నుంచి ఇప్పటివరకు రూ.లక్ష కోట్లు డిమాండ్ చేస్తూ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జిఎస్‌టి) అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు బుధవారం ధృవీకరించారు. సెప్టెంబరులో కంపెనీకి పంపిన రూ. 16,800 కోట్ల పన్ను నోటీసుకు సంబంధించి గత వారం, డెల్టా కార్ప్ రూ. 6,384 కోట్లకు తక్కువ పన్ను చెల్లింపు కోసం జిఎస్టి నోటీసును అందుకుంది.
 
జిఎస్టి అధికారుల నుంచి అటువంటి షోకాజ్ నోటీసులు అందుకున్న ఇతర గేమింగ్ కంపెనీలలో డ్రీమ్ 11, గేమ్స్‌క్రాఫ్ట్ ఉన్నాయి. రూ. 21,000 కోట్లు చెల్లించాలని వీటికి నోటీసుల్లో కోరారు. ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలపై 28 శాతం జిఎస్‌టి రేటును అమలు చేయడానికి అక్టోబర్ 1 తేదీగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన సంగతి తెలిసిందే.
 
బెట్టింగ్‌లో పాల్గొన్న కొన్ని ఆన్‌లైన్ గేమ్‌లపై ఇప్పటికే చట్టం ప్రకారం 28 శాతం జిఎస్‌టి వసూలు చేస్తున్నందున ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలపై జిఎస్‌టిని పునరాలోచనలో విధించడం లేదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టం చేసింది.