బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2023 (16:07 IST)

పసిడి ధరలకు బ్రేక్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు

Gold Ornament
పసిడి ధరలకు బ్రేక్ పడ్డాయి. దేశంలో పసిడి, వెండి ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,750గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,900గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,600 పలుకుతోంది. 
 
హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,600గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,750గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. 
 
దేశంలో వెండి ధరలు కూడా సోమవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,530గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 75,300గా ఉంది. ఆదివారం కూడా ఇదే ధర పలికింది.