ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 3 మార్చి 2021 (16:27 IST)

హైదరాబాద్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రం కోసం 300 మందిని ఉద్యోగాలలోకి తీసుకోనున్న టైడ్‌

యుకెకు చెందిన సుప్రసిద్ధ డిజిటల్‌ వ్యాపార ఆర్థిక వేదిక టైడ్‌, తాము అదనంగా మరో 180 మంది ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ ప్రతిభావంతులను విధులలోకి తీసుకోవడంతో పాటుగా మరో 100 మందిని వినియోగదారుల సేవా మద్దతు కోసం 2021 సంవత్సరాంతానికి విధులలోకి తీసుకోనున్నట్లు నేడు వెల్లడించింది. తద్వారా సంవత్సరాంతానికి సంస్థ యొక్క హైదరాబాద్‌ జీడీసీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 350కు చేరనుంది. వీరితో పాటుగా మరో 50 మందిని భారతదేశంలోని గురుగ్రామ్‌లోని తమ కార్పోరేట్‌ కార్యాలయంలో మార్కెటింగ్‌, మద్దతు సేవల కోసం విధులలోకి తీసుకోనుంది.
 
టైడ్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ గై డంకన్‌ మాట్లాడుతూ, ‘‘అంతర్జాతీయంగా  విస్తరించడానికి ప్రయత్నిస్తున్న వేళ, అత్యుత్తమ సాంకేతిక ప్రతిభావంతుల ఆవశ్యకత మాకుంది. అదృష్టవశాత్తు భారతదేశంలో మాకు వారు అందుబాటులో ఉన్నారు. మా అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికలలో హైదరాబాద్‌ అత్యంత కీలక కేంద్రం. అంతర్జాతీయంగా తమ ఎస్‌ఎంఈ సభ్యులకు అత్యధిక విలువను అందించాలనే టైడ్‌ లక్ష్య సాధనలో ముందుకు సాగేందుకు అవసరమైన స్థిరమైన ఆవిష్కరణలకు ఈ కేంద్రం తోడ్పడుతుంది’’ అని అన్నారు.
 
టైడ్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గుర్జోద్‌పాల్‌ సింగ్‌ మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్‌లో టైడ్‌ యొక్క గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు అంతర్జాతీయంగా పాత్ర ఉన్నప్పటికీ మా భారతీయ ప్రణాళికలలో సైతం అంతర్భాగంగా ఉంది. స్థానికంగా సామర్థ్యం కలిగి ఉండటం అతి పెద్ద ప్రయోజనం. భారతీయ ఎస్‌ఎంఈలకు అత్యుత్తమంగా సేవలనందించడంలో, వారికి అవసరమైన మద్దతును అందించడంలో ఈ టీమ్‌ మాకు తోడ్పడగలదని నమ్ముతున్నాము’’ అని అన్నారు.