మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (10:57 IST)

తగ్గిన బంగారం ధర.. రూ.110 తగ్గింది..

హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 110 రూపాయలు తగ్గి పసిడి ధర రూ.48,930 కు చేరింది. అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయలు తగ్గి రూ.44,850కు చేరింది. వెండి రేటు 300 రూపాయలు తగ్గటం తో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 68,800 కు చేరింది. 
 
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర ఔన్స్‌కు 0.18 శాతం పెరిగి 1816.7 డాలర్లకు చేరింది. ఇక వెండి ధర ఔన్స్‌కు 0.06% పడిపోయి 25.2 డాలర్లకు చేరుకుంది. ఆర్ధిక రాజధాని ముంబై లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80 రూపాయలు తగ్గి రూ. 48,050కు చేరింది. అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 80 రూపాయలు తగ్గి రూ. 47,050 కు చేరింది.