ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (08:15 IST)

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు : పెట్రోల్ 25 పైసలు -డీజల్ 30 పైసలు పెంపు

దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు పెరుగుతున్నాయి. మంగ‌ళ‌వారం లీటరు పెట్రో‌ల్‌పై 25 పైసలు, డీజి‌ల్‌పై 30 పైస‌లను పెంచిన దేశీయ చమురు మార్కెటింగ్‌ కంపె‌నీలు మరోమారు వినియోగదారులపై భారం మోపాయి. 
 
తాజాగా పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు వడ్డించాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర 102.94కు చేరగా.. డీజిల్‌ ధర రూ.91.42కు పెరి‌గింది. అలాగే ముంబైలో పెట్రోల్‌ ధర రూ.108.96‌కు ఎగ‌బా‌కగా, డీజిల్‌ ధర రూ.99.17కి చేరు‌కుంది. 
 
తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.107.08కి పెరగగా, డీజిల్‌ ధర రూ.99.75కు చేరింది. ఇక కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.103.65, డీజిల్‌ రూ.94.53, చెన్నైలో పెట్రోల్‌ రూ.100.49, డీజిల్‌ రూ.95.93కు చేరింది.