మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 అక్టోబరు 2021 (11:21 IST)

దేశంలో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు..!

పండగ సీజన్ ప్రారంభానికి ముందు పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. శనివారం దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై దాదాపు రూ.980 వరకు పెరిగింది. ఇక కొన్ని కొన్ని ప్రాంతాల్లో తక్కువగా పెరిగింది. ఆయా ప్రాంతాలను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.
 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,470 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,470 ఉంది.
 
అలాగే, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉంది.