బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 అక్టోబరు 2021 (09:32 IST)

పండగపూట పెట్రో మంట : భారీగా వడ్డిస్తున్న కంపెనీలు

పెట్రోల్, డీజల్ ధరల వడ్డనలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏమాత్రం దయాదాక్షిణ్యం చూపించడం లేదు. ఈ ధరలను ఇష్టానుసారంగా పెంచేశాయి. పండగ పూట కూడా ఈ బాదుడు తప్పలేదు. గురువారం కూడా పెట్రోల్, డీజల్ ధరలు పెంచాయి. 
 
ఈ పెంపు భారం లీట‌ర్ పెట్రోల్‌పై 37 పైస‌లు, డీజిల్‌పై 38 పైస‌లుగా ఉంది. దీంతో హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర రూ.109.37 కాగా, డీజిల్ ధ‌ర రూ.102.42గా ఉంది. పెట్రోల్ ధ‌ర‌లు అమాంతం పెరిగిపోవ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఆందోళ‌న‌ చెందుతున్నారు. 
 
ఈ నెల 12, 13 తేదీల్లో పెట్రోల్ ధ‌ర‌లు పెంచ‌లేదు. అంత‌కు ముందు వారం రోజుల పాటు వ‌రుస‌గా పెట్రోల్ ధ‌ర పెరిగాయి. మ‌ళ్లీ ఇప్పుడు రెండు రోజుల నుంచి పెట్రోల్ ధ‌ర‌లు వాహ‌నదారుల‌కు చుక్క‌లు చూపిస్తున్నాయి. బుధవారం ముంబైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.110గా ఉన్న‌ది. అన్ని రాష్ట్రాల్లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.100పైనే ఉన్న‌ది.