గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 మే 2022 (11:06 IST)

సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న టమోటా ధరలు.. సెంచరీ కొట్టిందిగా!

Tomato
నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో పాటుగా నిత్యావసర ధరలు కూడా పెరగడం, ఇప్పుడు అందులోకి టమాటో కూడా చేరడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ఈ జాబితాలో టమోటాలు చేరాయి. 
 
సామాన్యులకు టమోటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాదులో కిలో టమాటా ధర రూ. 80 నుంచి రూ. 100 పలుకుతుంది. టమాటా సాగు తగ్గడంతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు భారీగా తగ్గాయి. అంతేకాకుండా భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో మార్కెట్లో ధరలు మండుతున్నాయి. 
 
నిజానికి హోల్‌సేల్‌ మార్కెట్లకు నిత్యం 9వేల బాక్సుల్లో 2.25 లక్షల కేజీల టమాటా వచ్చేది. అప్పుడు ధర రూ.15లోపే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.
 
కేవలం 3 వేల టమాటా బాక్సులు మాత్రమే వస్తున్నాయి. ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు వ్యాపారులు. మళ్ళీ కొత్త పంట వచ్చేవరకు ఇలాగే ధరలు ఉండొచ్చనని అంటున్నారు.