సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 మే 2022 (16:15 IST)

మిస్టర్ బీఎస్ కుమార్.. వాక్చాతుర్యం కోసం అతి చేయొద్దు : మంత్రి కేటీఆర్

ktramarao
భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌కు తెలంగాణ మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుత్తిమెత్తగా కౌంటరిచ్చారు. వాక్చాతుర్యం కోసం అతిగా ప్రదర్శించవద్దని హితవు పలికారు. 
 
సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ నిర్వాకం వల్ల 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, ఈ మరణాలపై కనీసం స్పందించని దౌర్భాగ్య ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ బండి సంజయ్ ఇటీవల ఆరోపణలు చేశారు. వీటిపై ఆయన స్పందించారు. 
 
ఈ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఘాటుగా కౌంటరిచ్చారు. సంజయ్‌వి హాస్యాస్పదమైన, ఆధార రహితమైన ఆరోపణలు అని కేటీఆర్ పేర్కొన్నారు. బీఎస్ కుమార్.. ఆధారాలుంటే నిరూపించు. లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రచారం కోసం సంజయ్ వాక్చూతుర్యం ప్రదర్శించవద్దు. నిరాధారమైన ఆరోపణలు ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.