ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 14 ఏప్రియల్ 2024 (21:56 IST)

'ప్రగతి కోసం కమ్యూనిటీలకు సాధికారత'ను నిర్వహించిన వెల్స్పన్ ఫౌండేషన్

Welspun Foundation
కలుపుకొనిపోయే సంస్కృతిని ప్రోత్సహించడం, అవరోధాలను అధిగమించటం, ప్రతి ఒక్కరూ విలువైన వారుగా భావించటంతో పాటుగా నిమగ్నమై ఉన్నారని భావించే వాతావరణాన్ని పెంపొందించే లక్ష్యంతో హయతాబాద్‌లో ఒక ఉత్సాహభరితమైన వేడుకను వెల్స్పన్ ఫౌండేషన్ నిర్వహించింది. ఈ కార్యక్రమం వ్యక్తులు తమ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి, స్థిరత్వంను ప్రదర్శించడానికి వారిని శక్తివంతం చేయడంపై దృష్టి సారించింది.  సామాజిక మార్పును తీసుకురావటంలో, లింగ సమానత్వం తీసుకురావటం, నాయకత్వ అవకాశాల కోసం ప్రచారం చేయటంలో మహిళలు పోషించే ముఖ్యమైన పాత్రను ఇది నొక్కి చెప్పింది. ఈ కార్యక్రమానికి హాజరైనవారిని తమ నైపుణ్యాలు, జ్ఞానాన్ని నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని, స్వీయ భరోసా, అనుకూలతను పెంపొందించుకోవాలని ప్రోత్సహించారు.
 
తమ సామర్థ్యాలను గ్రహించేలా ఇతరులను ప్రేరేపించేటటువంటి మహోన్నత వ్యక్తి, శ్రీమతి ఇందిరా గాంధీకి సమానమైన శక్తివంతమైన వ్యక్తుల కథలను వెల్స్పన్ ఫౌండేషన్ వెల్లడించింది. ఈ సంస్థ మహిళల హక్కులు, ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం వంటి అంశాలపై చురుగ్గా పనిచేయటంతో పాటుగా  స్వేచ్ఛ కోసం నూతన నైపుణ్యాలను పొందడం యొక్క ప్రాముఖ్యత, ప్రేక్షకులతో విలువైన పరిజ్ఙానం పంచుకోవడం వంటి అంశాలపై పని చేస్తోంది.
 
ఈ వేడుకలో హయతాబాద్, మద్దూరు, చందనవెల్లి, సోలిపేట్, మాచన్‌పల్లి గ్రామాలకు చెందిన పాఠశాల విద్యార్థుల నృత్యాలు, స్కిట్‌లతో కూడిన ఉత్సాహభరితమైన ప్రదర్శనలు, వాతావరణంలోకి నూతనోత్తేజం తీసుకువచ్చాయి. "వెల్స్పన్ హైదరాబాద్‌లోని విశేషమైన వ్యక్తులకు నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, వారి అంకితభావం వారిని ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అనుమతించడమే కాకుండా గ్రామీణ వర్గాల ప్రజలతో అర్ధవంతమైన సంబంధాలను కూడా సులభతరం చేసింది. మీ నిబద్ధత సాధికారత కలిగిన వ్యక్తులు కలిసి పని చేయడం ద్వారా సాధించగల సామూహిక శక్తి, ప్రభావాన్ని ఉదాహరణగా చూపుతుంది.." అని వ్యాఖ్యానించారు. హాజరైన అతిథులు, మహిళా నాయకులను హృదయపూర్వకంగా అభినందించడం, పిల్లలకు బహుమతులు పంపిణీ చేయడం, కృతజ్ఞతలు తెలుపడంతో వేడుక ముగిసింది.