జియోమీ కొత్త రికార్డు.. 100 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లు ఇట్టే అమ్ముడుబోయాయ్..
మొబైళ్ల తయారీ సంస్థ జియోమీ కొత్త రికార్డు సృష్టించింది. చైనాకు చెందిన ఈ సంస్థ సరికొత్త ఫీచర్లతో బడ్జెట్‌లో స్మార్ట్ ఫోన్లను తీసుకురావడంతో.. తక్కువ కాలంలోనే అత్యధిక వినియోగదారులను సొంతం చేసుకుంది.
ముఖ్యంగా భారత్‌లో మొబైల్ ఫోన్ల అమ్మకాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ 100 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లను విక్రయించినట్లు జియోమీ వెల్లడించింది. దీంతో ఇతర చైనా కంపెనీలైన ఒప్పో, వీవోలను వెనక్కి నెట్టింది.
ఇంకా వరుసగా ఎనిమిది త్రైమాసికాల్లో అత్యధిక స్మార్ట్‌ఫోన్లు విక్రయించిన సంస్థల జాబితాలో జియోమీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ఈ రికార్డును ఇతర స్మార్ట్ ఫోన్ సంస్థ సాధించకపోవడం విశేషం.
అంతర్జాతీయంగా ఏ దేశంలోనూ, మార్కెట్‌లోనూ ఐదేళ్ల కాలంలో ఒక స్మార్ట్‌ఫోన్ కంపెనీ 100 మిలియన్ ఫోన్లను విక్రయించిన రికార్డు లేదు. ఇది తమ సంస్థకు ఓ మైలురాయి అని షమీ ఇండియా ఉపాధ్యక్షుడు మనుకుమార్ జైన్ వెల్లడించారు.