Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీ-టెట్) పరీక్ష వాయిదా

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 17 డిశెంబరు 2021 (11:29 IST)
దేశ వ్యాప్తంగా నిర్వహించే సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీ టెట్) పరీక్షను వాయిదా వేశారు. ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే ఈ పరీక్షలు గురువారం నుంచే ప్రారంభమయ్యాయి. కానీ, ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ పరీక్షల నిర్వహణను వాయిదావేశారు. అయితే, ఈ పరీక్షలను తిరిగి ఎపుడు నిర్వహిస్తారన్న అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. 
 
దేశంలోని ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో ఈ టెస్ట్‌ను దశలవారీగా వచ్చే యేడాది జనవరి 13వ తేదీ వరకు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. మొదటి రోజున పేపర్-2 పరీక్షలోని సర్వర్‌లో సమస్య తలెత్తింది. ఇది సాయంత్రం 4 గంటలైనా పరిష్కారం కాకపోవడంతో పరీక్షను వాయిదా వేశారు. అలాగే, శుక్రవారం, శనివారం ఉదయం, శనివారం నిర్వహించే పరీక్షలను కూడా రద్దు చేశారు. 
 
కాగా, సీ-టెట్‌తో కేంద్రీ విద్యాలయం, సైనిక్ స్కూల్స్, నవోదయ స్కూల్స్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన పాఠశాలల్లో విద్యా బోధనకు సీ-టెట్‌ను ప్రామాణికంగా భావిస్తారు. దేశ వ్యాప్తంగా ఈ పరీక్ష కోసం ప్రతి యేడాది ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. 

అన్నీ చూడండి

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

తర్వాతి కథనం
Show comments