గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2022 (17:10 IST)

డీఆర్‌డీవోలో రిక్రూట్మెంట్స్... దరఖాస్తుల ఆహ్వానం

Jobs
భారత రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ డీఆర్డీవోలో కొత్తగా పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేశారు. ఆసక్తితో పాటు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 
 
ఈ నోటిఫికేషన్ కింద సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి, టెక్నీషియన్-ఏ రిక్రూట్‌మెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 23 సెప్టెంబర్ 2022. ఈ నెల మూడో తేదీ నుంచి నుండి దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి. డీఆర్డీవో సీఈపీటీఏఎం రిక్రూట్మెంట్ 2022 ద్వారా 1901 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
 
1075 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బీ పోస్టులు ఉండగా 826 టెక్నీషియన్-ఏ ఖాళీలున్నాయి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి ఖాళీలకు అయితే ఏఐసీటీఈ గుర్తింపు పొందిన కళాశాల నుండి సైన్స్ లేదా ఇంజనీరింగ్ ని పూర్తి చెయ్యాలి. లేదంటే టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ కానీ సంబంధిత సబ్జెక్టు లో డిప్లొమాలో బ్యాచిలర్ డిగ్రీని ఉండాలి.
 
అదే టెక్నీషియన్-ఏ (టెక్-ఏ) పోస్ట్స్ కి అయితే 10వ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. అభ్యర్థుల వయస్సు కనిష్టంగా 18 యేళ్లు గరిష్టంగా 28 యేళ్లు ఉండాలి. పూర్తి వివరాల కోసం drdo.gov.in అనే వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.