శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2019 (17:37 IST)

సచివాలయ పోస్ట్‌ల కోసం పరీక్షలు.. కీలక సూచనలివే..

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ పోస్ట్‌ల కోసం పరీక్షలు రాయబోతున్న అభ్యర్థులకు కీలక సూచనలు..
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల భర్తీకి తొలి అడుగు పడబోతోంది. సచివాలయ పోస్ట్‌లకు సెప్టెంబర్‌ 1 నుంచి 8 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులు శాశ్వత ప్రాతిపదికన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులవుతారు. 
 
ఈ పరీక్షకు దాదాపు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి పరీక్షలు మొదలు కానున్నాయి. అభ్యర్థుల కోసం అధికారులు పలు సూచనలు చేసారు. ఆ సూచనలను మీరూ చూడండి.
 
* ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్‌లను ముందస్తుగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి
* గంటముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి 
* పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
* హాల్‌టికెట్‌, ఐడీకార్డు, పెన్ను మాత్రమే తీసుకురావాలి 
 
* పరీక్షా కేంద్రాలను గుర్తించేందుకు ఏర్పాట్లు 
* కూడళ్లు, బస్టాండ్‌లలో రూట్‌మ్యాప్‌లు, హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు 
* 150 ప్రశ్నలకు గానూ 150 మార్కులు ఉంటాయి
* పరీక్షల్లో నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుంది 
 
* నాలుగు తప్పులకు ఒక మార్కును తీసివేస్తారు 
* రెండు భాషాల్లో ప్రశ్నాపత్రం 
* టెక్నికల్‌ పేపర్‌ మాత్రం ఆంగ్లంలో ఉంటుంది 
* మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే కస్టడీలోకి తీసుకుంటారు.