గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (18:01 IST)

బోర్డు పరీక్షలు వాయిదా: ఎల్‌శాట్‌ ఇండియా పరీక్షలు మే 2021

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) పన్నెండవ తరగతి పరీక్షలను వాయిదా వేయడానికి స్పందనగా ఎల్‌శాక్‌ గ్లోబల్‌ ఇప్పుడు జూన్‌లో నిర్వహించతలబెట్టిన ఎల్‌శాట్‌ 2021ను మే 29, 2021తో ఆరంభించి పలు రోజుల పాటు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 2021 జూన్‌ 14 నుంచి ఈ పరీక్ష ఇప్పుడు శనివారం, 29 మే 2021కు ముందు జరిగింది.
 
బోర్డు పరీక్షల నిర్వహణలో గందరగోళంకు తోడు, కనీసం జూన్‌ 1వ తేదీ నాటికి కూడా జరుపుతామని ప్రకటించకపోవడంతో ఎల్‌శాక్‌ గ్లోబల్‌ ఇప్పుడు ప్రస్తుతం లా స్కూల్‌ ఔత్సాహికులు తమ పరీక్షల సంసిద్ధత ప్రయత్నాలను సైతం నిలుపుదల చేయడం తగదని భావించింది. మరీ ముఖ్యంగా, ఈ తేదీ మార్పుతో విద్యార్థులకు పరీక్షలు వరుసగా రావు సరికదా వారు రెండు పరీక్షలకూ తగినంతగా సిద్ధం కావడం కూడా సాధ్యమవుతుంది.
 
‘‘ఈ సంవత్సరారంభంలో, మేము ఎల్‌శాట్‌-ఇండియా కోసం అదనపు అడ్మిన్‌స్ట్రేషన్‌ను మార్చిలో నిర్వహించడం ద్వారా బోర్డు పరీక్షలతో సంఘర్షణ లేకుండా చేయాలనుకున్నాం. ఎందుకంటే, ఒకే సమయంలో రెండు పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావడం భారమవుతుందని మేము భావించాం’’ అని యూసుఫ్‌ అబ్దుల్‌ కరీమ్‌, వైస్‌ ప్రెసిడెంట్-ఎల్‌శాక్‌ అన్నారు.
 
‘‘ఎందుకంటే మా పరీక్షలను ఆన్‌లైన్‌తో పాటుగా ఇంటి వద్ద నుంచి కూడా రాయవచ్చు. ఎల్‌ శాట్‌ ఇండియా మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అందువల్ల, మేము పరీక్ష రాయగోరు విద్యార్థులకు ఒకే పరీక్షపై దృష్టి పెట్టి తమ అసలైన సామర్థ్యం వెల్లడించే అవకాశం మరియు ఇతర పరీక్షల గురించి బాధపడాల్సిన అవసరం లేకుండా అత్యున్నత కాలేజీలలో ప్రవేశాలు పొందేందుకు సైతం అవకాశం కల్పించాలనుకున్నాం’’ అని అన్నారు.
 
అసాధారణ సమస్యలకు అసాధారణ పరిష్కారాలు కావాల్సి ఉంటుంది మరియు కోవిడ్‌ 19 మహమ్మారి గత సంవత్సరం ఆరంభం అయింది. ఎల్‌శాట్‌-ఇండియా  ఆన్‌లైన్‌ టెస్ట్‌ డెలివరీ వ్యవస్థను వినియోగించుకుంటూ కృత్రిమ మేథస్సు సహాయక రిమోట్‌ ప్రోక్టరింగ్‌ను పరీక్ష యొక్క సమగ్రత మరియు వ్యాలిడిటీ కోసం వినియోగించింది. ఈ ఫార్మాట్‌తో విద్యార్థులు సురక్షితంగా తమ ఇంటి నుంచి పరీక్షకు హాజరుకావడంతో పాటుగా తమ లా స్కూల్‌ ప్రవేశ ప్రక్రియను ఎలాంటి అవాంతరం లేకుండా చేశారు.
 
ఇప్పుడు పరీక్షలను ముందుకు జరపడం వల్ల ఎల్‌శాట్‌ ఇండియా నమోదు ప్రక్రియను మే 14,2021వ తేదీతో ముగిస్తున్నారు. ఇప్పటికే 5వేల మంది విద్యార్థులు ఎల్‌ శాట్‌ ఇండియా 2021 కోసం నమోదు చేసుకున్నారు. ఎల్‌శాట్‌- ఇండియాను భారతదేశంలో అగ్రశ్రేణి లా కాలేజీలు తమ లా ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షగా వినియోగించుకుంటున్నాయి. ఎల్‌శాట్‌ ఇండియాలో పాల్గొన్న విద్యార్థులు భారతదేశంలో అగ్రశ్రేణి న్యాయ కళాశాలలో  దరఖాస్తు చేసుకోవచ్చు.
 
‘‘క్యాలెండర్‌లో మా పరీక్ష తేదీలను ముందుకు జరుపడం వల్ల విద్యార్థులు ఈ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఉన్న సమయం కూడా తగ్గుతుందని మాకు తెలుసు. అయితే, ఆన్‌లైన్‌ ఉపకరణాల ద్వారా విద్యార్థులకు తగు రీతిలో సహాయపడటానికి తాము సిద్ధమయ్యామని’’ అబ్దుల్‌ కరీమ్‌ అన్నారు.
 
ఈ పరీక్ష కోసం విద్యార్థులు సిద్ధమయ్యేందుకు సహాయపడుతూ ఎల్‌శాక్‌ గ్లోబల్‌ ఈ సంవత్సరారంభంలో ఎల్‌శాక్‌ లాప్రిప్‌ను ఆవిష్కరించింది. పోటీపరీక్షల లా స్కూల్‌ ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు సహాయపడే డిజిటల్‌  అభ్యాస వేదిక ఇది. ఎల్‌శాక్‌ లా ప్రిప్‌లో విస్తృతశ్రేణి లైబ్రరీ అందుబాటులో ఉంటుంది. దీనిలో విస్తృత స్థాయిలో ప్రాక్టీస్‌ పరీక్షలు ఉండటం వల్ల విద్యార్థులు మరింత విస్తృతంగా పరీక్షలకు సిద్ధం కావొచ్చు. ఎల్‌శాట్‌ ఇండియా పరీక్ష అనుభవంను ఇది విద్యార్థులకు అందించడంతో పాటుగా డిజిటల్‌ పరీక్ష విధానం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంది. దాదాపు 70 సంవత్సరాలకు పైగా పరీక్షల పరిశోధన మరియు అనుభవంతో రూపొందించిన ఎల్‌శాక్‌ లాప్రిప్‌, విద్యార్థులకు అవసరమైన క్రిటికల్‌, ఎనలిటికల్‌ ఆలోచనా నైపుణ్యాలను అందిస్తుంది.
 
ఎల్‌శాక్‌ లాప్రిప్‌ మరియు ఎల్‌శాట్‌ ఇండియా గురించిన మరింత సమాచారం కోసం డిస్కవర్‌ లా ఇండియా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అభ్యర్థులు డిస్కవర్‌ లా వెబ్‌సైట్‌ నుంచి మెటీరియల్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని దానిని ఈ పరీక్షకు సంసిద్ధం కావడం కోసం వినియోగించవచ్చు.