సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 27 మే 2019 (11:27 IST)

సెయిల్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)‌ సంస్థ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తాజాగా సెయిల్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.


మేనేజ్‌మెంట్ ట్రైనీ విభాగాల్లో మెకానికల్, మెటలర్జికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మైనింగ్ ఇంజనీరింగ్ పోస్టుల కోసం సెయిల్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 
 
మేనేజ్‌మెంట్ ట్రైనీ విభాగాల్లో పోస్టులు వున్నాయి. గేట్ 2019 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు సెయిల్ వెల్లడించింది.

ఈ ఉద్యోగాల కోసం సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి వుండాలి. ఇక 14-06-2019 నాటికి 28 ఏళ్లు మించకూడదని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.