Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు జేఈఈ మెయిన్స్ ర్యాంకుల రిజల్ట్

Written By ఠాగూర్
Published: సోమవారం, 13 సెప్టెంబరు 2021 (12:31 IST)
బీఈ, బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్‌ ర్యాంకులు సోమవారం వెలువడనున్నాయి. నాలుగో విడుత పర్సంటైల్‌తోపాటు తుది ర్యాంకులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించనుంది. దీంతోపాటు కటాఫ్‌ మార్కులను కూడా విడుదల చేయనుంది. విద్యార్థులు ర్యాంకుల కోసం అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.inలో చూడవచ్చు.
 
ఇదిలావుంటే, సోమవారం మధ్యాహ్నం నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 19 (ఆదివారం) సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 20న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చల్లించవచ్చు. 
 
అక్టోబరు 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహిస్తారు. షెడ్యూల్‌ ప్రకార అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ శనివారం ప్రారంభం కావాల్సి ఉన్నది. అయితే జేఈఈ మెయిన్‌ ర్యాంకుల వెల్లడిలో ఆలస్యం కావడంతో వాయిదాపడ్డాయి. మెయిన్‌ క్వాలిఫై అయిన 2.5 లక్షల మంది మాత్రమే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయడానికి వీలుంది.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments