ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (18:34 IST)

డిజిటల్‌ అడ్డుగోడలను అధిగమించేందుకు 20వేల మంది ఉపాధ్యాయులకు సహాయపడిన ఎక్సీడ్‌

విద్యారంగంలో అగ్రగామి సంస్ధ ఎక్సీడ్‌ ఎడ్యుకేషన్‌ నేడు తమ డిజిటల్‌గా సిద్ధమైన ఉపాధ్యాయుల సంఖ్య 20వేల మార్కును అధిగమించినట్లు వెల్లడించింది. బోధన, టీచర్‌ శిక్షణ, ప్రాధమిక సంవత్సరాల కోసం కరిక్యులమ్‌ తీర్చిదిద్దడంలో అగ్రగామి అయిన ఎక్సీడ్‌ నేడు తాము ఈ ఉపాధ్యాయులు డిజిటల్‌ అడ్డుగోడలను అధిగమించడంలో సహాయపడ్డామని వెల్లడించింది.

 
ఈ టీచర్‌ డిజిటల్‌ సాధికారిత ప్రయత్నాలు రెండంచెల విధానం అనుసరిస్తున్నాయి. అందులో ఒకటి సూపర్‌ టీచర్‌ యాప్‌ కాగా మరోటి సూపర్‌ టీచర్‌ శాటర్‌డే సెమినార్‌ సిరీస్‌. ఎక్సీడ్‌ సూపర్‌ టీచర్‌ యాప్‌ అనుభవపూర్వక ఎక్సీడ్‌ పద్ధతిని ఆన్‌లైన్‌ రూపంలో అతి సులభమైన పద్ధతిలో ప్రభావవంతమైన బోధన కోసం అందించడం జరిగింది.

 
సెమినార్‌ సిరీస్‌ టీచర్లకు ఆన్‌లైన్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌, ఏవిధంగా కమ్యూనికేట్‌ చేయాలి, ఆఫ్‌లైన్‌లో బోధించినట్లుగానే ప్రభావవంతంగా ఎలా బోధించాలి లాంటి అంశాలను తెలిపింది. నేడు 20 వేల మంది ఉపాధ్యాయులు పూర్తి స్ధాయిలో సిద్ధం కావడంతో పాటుగా సౌకర్యవంతంగానూ ఉండటంతో పాటుగా ఆన్‌లైన్‌ టీచింగ్‌ను సూపర్‌ టీచింగ్‌ శాటర్‌ డే సెమినార్‌ సిరీస్‌ ద్వారా పొందారు. ఇది గత 18 నెలలుగా జరుగుతుంది.

 
ఎక్సీడ్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండర్‌ అశీష్‌ రాజ్‌పాల్‌ మాట్లాడుతూ, ‘‘మహమ్మారి విజృంభణ నాటి నుంచి ఎక్సీడ్‌ ఈ ఆన్‌లైన్‌ సూపర్‌ టీచింగ్‌ శాటర్‌డే సెమినార్‌ సిరీస్‌ను టీచర్ల కోసం ప్రతి శనివారం గత 18 నెలల కాలంగా ఏకధాటిగా నిర్వహిస్తున్నాము. దాదాపు 20 వేల మంది టీచర్లకు ఆన్‌లైన్‌ టీచింగ్‌ను అందించడం ఎక్సీడ్‌ సాధించిన అతి పెద్ద మైలురాయిల్లో ఒకటి. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ మరియు ఉపాధ్యాయులు ఇప్పుడు సూపర్‌ టీచర్‌ శాటర్‌ డే సెమినార్ల పాత్రను గుర్తించడంతో పాటుగా తమ పాఠశాలలు మహమ్మారికి సిద్ధంగా ఉన్నాయనే భరోసా కలిగి ఉంటున్నారు’’ అని అన్నారు.