ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 31 మార్చి 2022 (14:16 IST)

ఉస్మానియా ఆస్పత్రిలో ఉద్యోగ అవకాశాలు

హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా వైద్య కాలేజీ, జనరల్ ఆస్పత్రిలో ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి వివరాలను పరిశీలిస్తే, 
 
మొత్తం 135 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థుల వయసు 18 నుంచి 44 యేళ్ల మధ్య ఉండాలి. 
 
ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మొత్తం 115 ఉండగా, పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీలో ఉత్తీర్ణులై ఉండాలి. నెలకు రూ.1,25,000 వరకు వేతనంగా చెల్లిస్తారు. 
 
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 115 ఉండగా ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ, ఏపీ మెడకిల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి. ఈ పోస్టుకు ఎంపికయ్యే వారికి నెలకు 52 వేలు వేతనంగా చెల్లిస్తారు. 
 
ఈ పోస్టులకు అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను "ది ప్రిన్సిపాల్, ఉస్మానియా వైద్య కాలేజీ, హైదరాబాద్ 500095 అనే చిరునామాకు ఏప్రిల్ 4వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు చేరవేయాల్సి ఉంటుంది.