సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By సిహెచ్
Last Modified: ఆదివారం, 10 అక్టోబరు 2021 (13:35 IST)

పిల్లల ఎముకలు బలంగా వుండాలంటే...

పిల్లలకు పాలతోపాటు ఏవేవో హెల్త్ డ్రింక్స్ అంటూ పలు విధాలయిన బ్రాండ్లతో తయారు చేసిన పొడిని కలిపి ఇస్తుంటారు పేరెంట్స్. అసలు పాలలో ఏముంది...? అనేది చాలామందికి తెలియదు. ఒక్కసారి తెలుసుకుందాం.
 
ఎముకలు బాగా పుష్టిగా ఉండాలంటే క్యాల్షియం అవసరం అన్నది తెలిసిందే. పాలలో క్యాల్షియంతోపాటు విటమిన్ డి కూడా ఉంటుంది. ఒక గ్లాసు పాలలో 30 శాతం క్యాల్షియం, 30 శాతం విటమిన్ డి ఉంటాయి. అంతేకాదు... ఎముకలు బలంగా ఉండేందుకు పాలు, పాలతో తయారుచేసిన పదార్థాలను తీసుకుంటుండాలి.
 
అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పును తీసుకోవడాన్ని తగ్గించుకోవాలి. అలాగే పాలు, పళ్లు తీసుకుంటుంటే అధిక రక్తపోటు అదుపులో ఉంచుకోవచ్చు. పాలు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను ఇవి నియంత్రిస్తాయి.