గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 8 అక్టోబరు 2021 (15:47 IST)

యూనిసెఫ్ హ్యాండ్ హైజీన్ క్యాంపెయిన్ ప్రాజెక్ట్ ప్రారంభం

చైల్డ్ ఫండ్, యూనిసెఫ్ సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన హ్యాండ్ హైజీన్ క్యాంపెయిన్ ప్రాజెక్ట్ లో భాగంగా విజ‌య‌వాడ‌ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఫుట్ ఆపరేటింగ్ హ్యాండ్ వాష్ స్టేషన్ ను సబ్ కలెక్టర్ జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆయన  మాట్లాడుతూ, కోవిడ్ ను తరిమి వేయటంలో ముఖ్య భాగంగా హ్యాండ్ హైజిన్ కెంపయిన్  నిర్వహిస్తున్న చైల్డ్ ఫండ్, యూనిసెఫ్ ను అభినందించారు. వారి సేవలు జిల్లాలో వున్నవారికి అద్భుతంగా ఉపయోగపడుతూ, ప్రజల్లో సరైన పద్ధతులపై అవగాహన క‌ల్పించ‌డం అభినందనీయమన్నారు. 
 
సచివాలయంలో కూడా ఈ ఫుట్ ఆపరేటింగ్ హ్యాండ్ వాష్ స్టేషన్ ఉంచడం ద్వారా, సచివాలయంలోకి వచ్చే ముందుగా కచ్చితంగా చేతులు శుభ్రపరుచుకుని రావడం అల‌వాటు అవుతోంద‌న్నారు. దీని ద్వారా వారి నిత్యాజీవితంలో కూడా రెగ్యులర్ గా హ్యాండ్ వాష్ అనేది అలవాటు చేసుకుంటారన్నారు.
 
ఈ ప్రాజెక్ట్ లో భాగంగా జిల్లా లోని 15 అర్బన్, రూరల్  ప్రాంతాల్లో గ్రామ, వార్డు సచివాలయాలలో ఫుట్ ఆపరేటింగ్ హ్యాండ్ వాష్ స్టేషన్ లను ఏర్పాటు చేయడాన్ని సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్  జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  చైల్డ్  ఫండ్ ఇండియా  సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సౌజన్య లత, నెహ్రు యువ కేంద్రం జిల్లా యూత్ కో ఆర్డినేటర్ సుంకర రాము, చైల్డ్ ఫండ్  సిబ్బంది టైసన్, షాజాద్, మల్లేష్, భవాని, గౌరి పాల్గొన్నారు.