శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 అక్టోబరు 2021 (15:25 IST)

హర్యానాలో అంతుచిక్కని జ్వరం - 24 మంది చిన్నారుల మృతి

హర్యానా రాష్ట్రంలో అంతుచిక్కని జ్వరాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ జ్వరాలకు చిన్నారులు అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలోని పాల్వల్ జిల్లాలో అంతు చిక్కని జ్వరంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
 
ఈ అంతుచిక్కని జ్వరంతో హథిన్​ ప్రాంతంలో గడిచిన పది రోజుల్లో 24 మంది చిన్నారులు మరణించారు. చిల్లీ గ్రామంలో 11 మంది సహా మరో రెండు చోట్ల 13 మంది మృతిచెందారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ జ్వరం బారిన పడినవారి సంఖ్యతో పాటు మృతులు పెరగడం వల్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
 
జ్వరం బారినపడిన రెండు రోజులకే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తన చిన్నారి మరణించినట్లు బాధిత తల్లిదండ్రులు తెలిపారు. ప్లేట్​లెట్స్​ కౌంట్​ భారీగా తగ్గిపోయి.. తొమ్మిది నెలల పసికందు చనిపోయింది. అయితే ఆ శిశువు డెంగ్యూతో చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. ఇంత మంది పిల్లలు మరణించినప్పటికీ వైద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు.