సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జనవరి 2022 (09:38 IST)

ఏపీలో కరోనా విజృంభణ: ప్రకాశం జిల్లా పాఠశాలలో 147 మందికి పాజిటివ్

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఏపీలో రోజుకు 13వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలోని పాఠశాలల్లో కరోనా కల్లోలం రేపింది. 
 
తాజాగా 54 మంది ఉపాద్యాయులు, 18 మంది విద్యార్థులు, నలుగురు నాన్ టీచింగ్ స్టాఫ్ కు పాజిటి‌వ్‌గా నిర్ధారణ అయింది. సంక్రాంతి సెలవుల అనంతరం గత ఐదు రోజుల్లో మొత్తం 147 మందికి ఆ పాఠశాలలో కరోనా వైరస్‌ సోకింది.
 
నిన్న జిల్లా వ్యాప్తంగా నమోదైన 772 కరోనా కేసుల్లో పాఠశాలల్లోనే 10 శాతం కేసులు నమోదు అయ్యాయి. రోజు రోజుకూ పాఠశాలల్లో భారీగా నమోదవుతున్న కేసులతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంటుంది.