Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఆంధ్రాలో కట్టు తెంచుకున్న కరోనా - హడలెత్తిస్తున్న మరణాలు

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 17 జులై 2020 (17:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టలు తెంచుకున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా ప్రతి రోజూ వందల, వేల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలు దాటిపోయాయి. గడచిన 24 గంటల్లో 2602 కొత్త కేసులు నమోదు కాదా. 42 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 534కి పెరిగింది. 
 
ఇక జిల్లాల వారీగా కొత్త కేసుల నమోదును పరిశీలిస్తే, తూర్పుగోదావరిలో అత్యధికంగా 643 కేసులు నమోదయ్యాయి. అటు, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40,646కి చేరింది. తాజాగా 837 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 19,814 మంది చికిత్స పొందుతున్నారు.
 
ప్రస్తుతం ఆయా జిల్లాల్లో ఉన్న యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే, 1724 (మొత్తం కేసులు 4284), చిత్తూరు 2459 (3864), ఈస్ట్ గోదావరి 3339 (4505), గుంటూరు 2186 (4330), కడప 982 (2275), కృష్ణ 827 (3021), కర్నూలు 2691 (5131), నెల్లూరు 923 (1717), ప్రకాశం 347 (1448) ఉన్నాయి.
 
అలాగే, శ్రీకాకుళం 1239 (1852), విశాఖపట్టణం 513 (1716), విజయనగరం 770 (1071), వెస్ట్ గోదావరి 1403 (2537) చొప్పున ఉన్నాయి. అలాగే, ఇతర రాష్ట్రాలకు చెందిన వారి కేసులు 356 యాక్టివ్ కేసులు ఉండగా మొత్తం కేసులు 2461గా ఉన్నాయి. ఇతర దేశాల నుంచి కరోనా వైరస్ బారినపడిన యాక్టివ్ కేసుల సంఖ్య 53 కాగా, మొత్తం కేసుల సంఖ్య 434గా ఉన్నాయి. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments