శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 జులై 2020 (10:53 IST)

మరో వారం రోజులు ఆస్పత్రిలోనే అమితాబ్ బచ్చన్, అభిషేక్..

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకుంటున్నారు. బిగ్ బి, ఆయన తనయుడు అభిషేక్‌ కరోనా పాజిటివ్‌తో ముంబై నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బిగ్ బి కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్యలకు కూడా పాజిటివ్‌ వచ్చినా, ఇద్దరూ ఇంటి వద్దే ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. 
 
అమితాబ్, అభిషేక్‌ చికిత్సకు చక్కగా సహకరిస్తున్నారని, ఇద్దరు కోలుకుంటున్నారని, మరో వారం రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని డాక్టర్లు పేర్కొన్నారు. కాగా బిగ్‌ బి కుటుంబం త్వరగా కోలుకోవాలని పలువురు సినిమా తారలు, అభిమానులు పూజలు చేస్తున్నారు. 
 
మరోవైపు బిగ్ భార్య జయాబచ్చన్‌కు నెగిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె కూడా హోం ఐసోలేషన్లో వున్నారు. అమితాబ్ వయసు 77 ఏళ్లు. కరోనా లక్షణాలు తొలి దశలోనే ఉన్నా, ఈ వయసులో రిస్క్ తీసుకోవడం ఎందుకని భావించి నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 
 
అమితాబ్‌కి వయసు మీద పడినా యాక్టివ్‌గా వున్నారని, కరోనా లక్షణాలు తక్కువగా వున్నా ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలోనే చేరి బిగ్ బి అమితాబ్ చికిత్స పొందుతున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో అమితాబ్ సినిమా కార్మికులకు ఎంతో సాయం చేసిన సంగతి తెలిసిందే.