Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవిడ్‌ చికిత్సకు మరో ఔషధం.. ఏంటో తెలుసా?

Written By ఎం
Updated: మంగళవారం, 4 మే 2021 (21:50 IST)
హైదరాబాద్‌: కొవిడ్‌ రోగుల చికిత్సలో వాడేందుకు మరో ఔషధానికి అత్యవసర వినియోగ అనుమతి లభించింది. సోమవారం ఉదయం నాట్కో ఫార్మా, ‘బారిసిటినిబ్‌’ 1 మి.గ్రా., 2 మి.గ్రా., 4 మి.గ్రా., డోసుల టాబ్లెట్ల వినియోగానికి సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రలోల్‌ ఆర్గనైజేన్‌ (సిడిఎస్‌సిఓ) అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చినట్టు తెలిపింది.

ఇక మీదట కొవిడ్‌-19 పాజిటివ్‌ పేషెంట్ల చికిత్సలో రెమిడెసివిర్‌తో పాటు, బారిసిటినిబ్‌ను కూడా ఉపయోగిస్తారు. దేశమంతటా కరోనా పేషెంట్లకు ‘బారిసిటినిబ్‌’ను సరఫరా చేసేందుకు ఈ వారంలోనే ఉత్పత్తిని ప్రారంభిస్తామని నాట్కో ఫార్మా తెలిపింది.
 
దేశంలో రెమిడెసివిర్‌ ఔషధం కొరత ఉన్న నేపథ్యంలో దానిని అధిగమించేందుకు ‘బారిసిటినిబ్’ అత్యవసర వినియోగానికి నాట్కో పార్మాకు అనుమతులు లభించాయి. ‘బారిసిటినిబ్’ ఔషధానికి అనుమతి లభించడంతో నాట్కో ఫార్మా సంస్థల షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. నాట్కో ఫార్మా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు బ్రాండెడ్‌, జనరిక్‌ మందులు, బల్క్‌ యాక్టివ్స్‌, ఇంటర్మీడియేట్స్‌ను సరఫరా చేస్తోంది..

అన్నీ చూడండి

సందీప్ రెడ్డి వంగా సినిమా రోమాంచకం టైటిల్ సాంగ్ రిలీజ్

సత్యజిత్ రే, రాజమౌళి సినిమాలు ఇష్టపడతాను : దర్శకుడు ఉదయ్ చౌహాన్

jony master :దళారులు లేకుండా కళాకారులకు నేరుగా చెల్లింపులు : టీ.జి. విశ్వ ప్రసాద్

రూరల్ ఎంటర్‌టైనర్‌గా శివకార్తికేయన్ చిత్రం సెయాన్ రెండో షెడ్యూల్ షురూ

Haiwaan: అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్, డైరెక్టర్ ప్రియదర్శన్ ల హైవాన్ టీజర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments