సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 జులై 2020 (19:14 IST)

ఏపీలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి.. 10వేల మార్కు దాటిన కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. గడిచిన 24గంటల్లో 70,068 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 10,167 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,30,557కి చేరింది. ఏపీని కరోనా మహమ్మారి పట్టిపిడిస్తోంది. రెండు రోజులుగా పదివేల కేసులు నమోదవుతున్నాయి. 
 
ప్రస్తుతం ఏపీలో 69,252 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాను జయించి 60,024 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో 18,90,077 కరోనా టెస్టుల నిర్వహించారు. కరోనా కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా రాష్ట్రంలో నానాటికీ పెరుగుతూనే ఉంది. అటు కేసులు, ఇటు మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గురువారం ఒక్క రోజే కరోనాతో 68 మంది మృతి చెందారు. 
 
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 1,281 మరణాలు సంభవించాయి. తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలో తొమ్మిది మంది చొప్పున మృతి చెందారు. అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం జిల్లాలో 8 మంది చొప్పున మృతి చెందారు. 
 
ఎప్పటిల్లాగే తూర్పుగోదావరి జిల్లాలో అధికంగా 1,441 కేసులు నమోదయ్యాయి. కర్నూలు 1,252, విశాఖ 1,223, పశ్చిమగోదావరి జిల్లాలో 998 కేసులు నమోదయ్యాయి. అనంతపురం 954, గుంటూరు 946, కడప 753, నెల్లూరు 702, శ్రీకాకుళం 586 కేసులను గుర్తించారు. చిత్తూరు 509, ప్రకాశం 318, కృష్ణా 271, విజయనగరం 214 మందికి కరోనా సోకింది.