ధారావిలో తొలి ఒమిక్రాన్ కేసు- అధికారుల్లో టెన్షన్

శుక్రవారం, 10 డిశెంబరు 2021 (22:33 IST)
కరోనా వైరస్ ముంబై నగరంలోని ధారావి ప్రాంతంలో భయంకరంగా వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఒమిక్రాన్ కూడా ధారావిని తాకింది. దీంతో ముంబై ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 
 
దక్షిణాఫ్రికా నుంచి పుట్టుకొచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. మన దేశాన్ని కూడా పలకరించింది. ఇప్పటికే దేశంలో 25 ఒమిక్రాన్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలో తాజాగా మరో కేసు వెలుగులోకి వచ్చింది. 
 
ఆసియాలోన అతిపెద్ద మురికివాడగా పేరున్న ధారావిలో ఒమిక్రాన్ కేసు బయటపడింది. ధారావికి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్థారణ అయ్యింది. 
 
డిసెంబర్ 4న ఆయన టాంజానియా నుంచి ముంబై చేరుకున్నారని బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు తెలిపారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారిని ట్రాక్ చేసే పనిలో పడ్డారు.  

అన్నీ చూడండి

'పెద్ది' చిత్రం టిక్కెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన సర్కారు

చెర్రీతో సెల్ఫీ కోసం ఎగబడి జాన్వీ మీద పడ్డ అభిమాని, దూదిలా లేపేసిన చరణ్ బాడీగార్డ్, వీడియో

ఏదోరకంగా మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు, అందుకే తెలంగాణలో గొడవ

Chaitu: నాగ చైతన్య కు ఢిల్లీ హైకోర్టులో విజయం

Joe Sharma : జో శర్మ నటించిన ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్) ఓటీటీలోకి వచ్చేస్తుంది

తర్వాతి కథనం
Show comments