మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (10:09 IST)

చైనాలో కరోనా వైరస్‌.. పిల్లుల్ని చంపేస్తున్నారు..

చైనాలో కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తోంది. దీంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇద్దరు, ముగ్గురికి కరోనా పాజిటివ్‌ అని తేలినా.. వెంటనే వారి ఉండే ప్రాంతంలోని వేల మందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. తాజాగా ఉత్తరచైనాలోని ఓ నగరంలో మూడు పిల్లులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో.. అధికారులు వాటిని చంపివేశారు.
 
కరోనా సోకిన జంతువులకు చికిత్స చేసేందుకు వ్యాక్సిన్లు, మందులు లేవు. పిల్లుల ద్వారా వాటి యజమానులకు, అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వారికి ప్రమాదం ఉందని.. అందుకే పిల్లులను చంపివేశామని హర్బిన్‌ నగర అధికారులు తెలిపారు.
 
సెప్టెంబర్‌ 21వ తేదీన పిల్లులకు ఆహారం, నీటిని అందించిన తర్వాత.. పిల్లుల యజమాని కరోనా టెస్టు చేయించుకున్నారు. టెస్టులో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలోనే అధికారులు పిల్లులకు టెస్ట్‌ చేయగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో పిల్లులను అధికారులు చంపివేశారు.