గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 మే 2021 (13:00 IST)

ఢిల్లీ సరోజ్ ఆస్పత్రిలో 80 మంది వైద్యులకు కరోనా వైరస్

దేశ రాజధాని హస్తినను కరోనా వైరస్ ఓ ఆట ఆడుతోంది. ప్రతి రోజూ వేలాదిమంది ఈ వైరస్ బారినపడుతున్నారు. ముఖ్యంగా, కరోనా రోగుల ప్రాణాలు కాపాడాల్సి వైద్యులు కూడా ఈ వైరస్ చేతికి చిక్కి ప్రాణాలు కోల్పోతున్నారు.
 
ఈ క్రంమలో ఢిల్లీలోని సరోజ్ ఆస్పత్రిలో ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 80 మంది వైద్యులు కరోనా బారిన పడ్డారు. వారంతా కూడా ఇదే ఆస్పత్రిలో పని చేస్తుండటం గమనార్హం. 
 
అందులో ఒక శస్త్రచికిత్స నిపుణుడు మహమ్మారికి బలయ్యారు. అయినా కూడా ఆ ఆసుపత్రి తన ధర్మం మరిచిపోకుండా కరోనా బాధితులకు చికిత్స చేస్తూనే ఉంది. అయితే, అవుట్ పేషెంట్ విభాగాన్ని మాత్రం కొన్ని రోజుల పాటు బంద్ పెట్టింది. ఇదీ ఢిల్లీలోని సరోజ్ హాస్పిటల్‌లో ఉన్న దీన పరిస్థితి.
 
ప్రస్తుతం కరోనా బారిన పడిన వైద్యుల్లో 12 మందికి ఆసుపత్రిలో చికిత్స చేస్తుండగా.. దాదాపు 30 ఏళ్ల పాటు సరోజ్‌లో శస్త్రచికిత్స నిపుణుడిగా పనిచేసిన డాక్టర్ ఎ.కె. రావత్ కన్నుమూశారు. మిగతా వారంతా ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నారు.