Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో 6676 కరోనా కేసులు - దేశంలో 13 వేల పాజిటివ్ కేసులు

Written By సెల్వి
Updated: మంగళవారం, 19 అక్టోబరు 2021 (11:26 IST)
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గడచిన 24 గంటల్లో కొత్త‌గా 13,058 క‌రోనా కేసులు వెలుగుచూశాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. కొత్త కేసులు 231 రోజుల కనిష్ట స్థాయిలో న‌మోద‌య్యాయ‌ని తెలిపింది. అలాగే, 19,470 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.
 
ఇకపోతే, నిన్న క‌రోనాతో 164 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,52,454కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య‌ 3,40,94,373కు పెరిగింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 227 రోజు క‌నిష్టానికి చేరింది. ప్ర‌స్తుతం 1,83,118 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స పొందుతున్నారు.
 
ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,34,58,801 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం 98,67,69,411 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. కేర‌ళ‌లో నిన్న‌ 6,676 కేసులు న‌మోద‌య్యాయి. ఆ రాష్ట్రంలో నిన్న‌ 60 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.

అన్నీ చూడండి

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

Deepti Ghanta: నితిన్, దీప్తి గంట చిత్రం అలియాస్ రుక్మిణీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

తర్వాతి కథనం
Show comments