టీమ్ ఇండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
టీమ్ ఇండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పేరు దాదాపు ఖరారైంది. కోచ్‌గా ద్రవిడ్‌ను ఖరారు చేసినట్లు బీసీసీఐ అధికారి వెల్లడించారు. అయితే రాహుల్ ద్రవిడ్ ఎంపికను బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. టీ-20 ప్రపంచ కప్ తర్వాత, నవంబరు 14తో ప్రస్తుత కోచ్ రవి శాస్త్రి పదవీ కాలం ముగియనుంది. కివీస్ పర్యటన నుంచి ద్రవిడ్ బాధ్యతలు చేపడతారని, 2023 వన్డే ప్రపంచ కప్ వరకు ద్రవిడ్ భారత జట్టుకు కోచ్‌గా ఉంటారని వెల్లడించారు.
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా, ఇండియా-ఏ జట్టకు కోచ్‌గా ద్రవిడ్ ఉన్నారు. ఇటీవల శ్రీలంకలో పర్యటించిన టీమిండియాకు ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ద్రవిడ్ కోచ్ గా ఉంటే, భారత జట్టుకు సత్ఫలితాలుంటాయని క్రికెట్ అభిమానులు కూడా భావిస్తున్నారు. సెంటిమెంట్ గా ద్రవిడ్ సారధ్యం బాగుంటుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈ దిశగా అడుగులు పడితే, భారత్ జట్టు నుంచి మరిన్ని విజయాలను ఆశించవచ్చని భారత క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.