బుధవారం, 1 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

భారత క్రికెట్ జట్టు కోచ్‌ పదవిని సున్నితంగా తిరస్కరించిన ద్రవిడ్

భారత క్రికెట్ జట్టు కోచ్ పదవిని మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం కోచ్‌గా రవిశాస్త్రి కొనసాగుతున్నారు. ఆయన ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టీమిండియా తదుపరి కోచ్‌ ఎవరనే అంశంపై విపరీతమైన చర్చ జరుగుతోంది. 
 
ఈ అంశంలో అనిల్ కుంబ్లే తదితరుల పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. తాజాగా రాహుల్ ద్రవిడ్‌కు ఈ పదవి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని వార్తలొచ్చాయి. అయితే బీసీసీఐ ఆఫర్‌ను ద్రవిడ్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
 
ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కుర్రాళ్లకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ద్రవిడ్ భుజాలకెత్తుకొని ఉన్నాడు. దీంతోపాటు అండర్‌-19 భారత జట్టు, ఇండియా ఎ జట్లకు కోచ్‌గా ఉన్నాడు. 
 
ఈ నేపథ్యంలో రవిశాస్త్రి తప్పుకోగానే కోచ్‌ పదవిని ద్రవిడ్‌కు అప్పగించాలని బీసీసీఐ భావించింది. కానీ ద్రవిడ్ మాత్రం దీనికి సుముఖంగా లేనట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ ముగియగానే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కోహ్లీ కూడా ప్రకటించాడు.