Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఆంధ్రప్రదేశ్ - తెలంగాణాల్లో ఈ రోజు కరోనా కేసులెన్ని?

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 18 జులై 2021 (20:13 IST)
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా, ఏపీ కంటే తెలంగాణాలో ఈ కేసుల సంఖ్య చాలా వరకు తగ్గింది. ఆదివారం నాటి లెక్కల ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే, 
 
ఏపీలో గడచిన 24 గంటల్లో 1,05,024 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,974 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 577 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 501, ప్రకాశం జిల్లాలో 349, కృష్ణా జిల్లాలో 311 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 33 కేసులు నమోదయ్యాయి.
 
అదేసమయంలో 3,290 మంది కరోనా నుంచి కోలుకోగా, 17 మంది మరణించారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఐదుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,40,096 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,02,256 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 24,708 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 13,132కి పెరిగింది.
 
అలాగే, తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 578 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 731 మంది బాధితులు చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా మరో ముగ్గురు మృతి చెందారు. 
 
రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు 6,36,627కు పెరిగాయి. 6,23,044 మంది చికిత్సకు కోలుకున్నారు. ఇంకా 9,824 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాలు 3,759కు చేరాయి. 

అన్నీ చూడండి

Ranabali trailer: రాయలసీమలో అణచివేతకు పోరాడే రాజవంశం కథగా రణబలి ట్రైలర్

Shruti Haasan: ఆ టాయ్స్‌ గురించి ఓపెన్‌గా మాట్లాడిన శృతిహాసన్

ఆకట్టుకునేలా గుడ్ టైమ్ ట్రైలర్ : అనిల్ విశ్వనాథ్, కామాక్షి భాస్కర్ల

Shweta Basuprasad: వరుణ్ సందేశ్, శ్వేతా బసుప్రసాద్ వెబ్ సిరీస్ నా వైఫ్ మిస్సింగ్

Sree Vishnu: నక్సల్ బ్యాక్‌డ్రాప్‌ అయినా మంచి ఎంటర్టైనర్ చిత్రం కామ్రేడ్ కళ్యాణ్ : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments