బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2020 (11:15 IST)

ఏపీలో కొత్తగా 56 కరోనా పాజిటివ్ : అధికారులు టెన్షన్.. టెన్షన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 813కు చేరింది. 
 
ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం... బుధవారం ఒక్క రోజే కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 813కు చేరాయి. అలాగే, 120 మంది రోగులు డిశ్చార్జ్ కాగా, మృతుల సంఖ్య 24కు చేరాయి. 
 
ఇదిలావుంటే, ఇటీవల సౌత్ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టులు నిర్వహిస్తోంది. ఈ పరీక్షల కారణంగానే కొత్త కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది.