Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. 993 కొత్త కేసులు

Written By సెల్వి
Updated: శనివారం, 20 ఫిబ్రవరి 2021 (15:22 IST)
భారత్‌లో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేగింది. దేశంలో కొంతకాలంగా తగ్గుమఖం పట్టిన కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 22 రోజుల తర్వాత కొత్త కేసులు మరోమారు దాదాపు 14వేలకు చేరాయి. గడిచిన 24 గంటల్లో 13వేల 993 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,09,77,387కి చేరింది. 
 
ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కొత్త కేసుల్లో దాదాపు 75శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే నమోదవడం గమనార్హం.
 
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరోమారు విజృంభించింది. మూడున్నర నెలల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
రాష్ట్రవ్యాప్తంగా నిన్న(ఫిబ్రవరి 19,2021) 6వేల 112 కేసులు రికార్డ్ అయ్యాయి. అక్టోబర్(2020) 30 తర్వాత 6 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అక్టోబర్ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
 
పంజాబ్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేరళ..అందరికన్నా ముందు ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో రోజూవారీ కేసులు ఎక్కువగా ఉన్నాయి. 
 
కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు ముంబైలో నిన్న ఒక్క రోజే 13వేల 592మందికి జరిమానా విధించారు. జరిమానాల రూపంలో 27లక్షల 18వేల రూపాయలు వసూలు చేశారు.
 
2020 మార్చి నుంచి 2021 ఫిబ్రవరి 19వరకు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా తిరిగినందుకు 15లక్షల 71వేల 679మందికి జరిమానా విధించారు. వారి నుంచి 31కోట్ల 79లక్షల 43వేల 400 రూపాయలు వసూలు చేశారు.

అన్నీ చూడండి

Anand Deverakonda : దేవరకొండ ఇంటిలో మరో అన్నా వదిన అంటూ ఆనంద్, వైష్ణవి లను పోల్చిన అభిమానులు

ప్రభాస్ చిత్రం పౌర్ణమిలోని తెలుగు పాటకు చైనీస్ నర్తకి నాట్యం ట్రెండింగ్ వీడియో

మమ్ముట్టి మూవీ ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ నుంచి వీడియో గ్లింప్స్

Fauzi Update: పోస్ట్‌ప్రొడక్షన్‌తో ఫౌజీ స్పీడ్.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ ?

Sumanth: పవన్ కళ్యాణ్ గారికి వారాహి పాజిటివ్‌గా హెల్ప్ అయింది : సుమంత్

తర్వాతి కథనం
Show comments