శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఫిబ్రవరి 2021 (09:23 IST)

గాల్వన్ లోయలో ఘర్షణ.. వీడియో విడుదల చేసిన చైనా (video)

డ్రాగన్ కంట్రీ చైనా.. తాజాగా గాల్వాన్ ఘర్షణకు సంబంధించి వీడియోను మీడియా ద్వారా రిలీజ్ చేసింది. అందులోనూ తమ సైనికులు వీరోచితంగా పోరాడి అమరులు అయ్యారని గొప్పగా చెప్పుకుంది. గతేడాది జూన్‌లో... లఢక్ తూర్పున సరిహద్దు ప్రాంతమైన గాల్వాన్ లోయలో... భారత్, చైనా సైనికుల మధ్య ఈ ఘర్షణ జరిగింది. 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 
 
దీనిపై అప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్న డ్రాగన్ ప్రభుత్వం... తాజాగా తమ సైనికులు నలుగురు చనిపోయారని చెప్పుకొచ్చింది. అందులో ఎంతవరకూ నిజం ఉందన్నది చైనాకే తెలియాలి. ఆ నలుగురినీ మెచ్చుకుంటూ... ఓ వీడియో చేసి... అందులో ఘర్షణ విజువల్స్ మిక్స్ చేసింది.
 
ఈ వీడియోని చూస్తేనే అర్థమవుతుంది చైనా ఎంత కుట్రపూరితంగా ఈ ఘర్షణకు దిగిందో. వీడియోలో భారత సైనికుల కంటే చైనా సైన్యం ఎన్నో రెట్లు ఎక్కువ సంఖ్యలో ఉంది. పొలోమంటూ సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చి కావాలనే ఘర్షణకు దిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తన తప్పును కూడా గొప్పగా చెప్పుకోవడం చైనాకే చెల్లుతోంది.