Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 5.63 శాతానికి తగ్గిన క్రియాశీల కేసులు

Written By ఎం
Updated: శుక్రవారం, 13 నవంబరు 2020 (20:13 IST)
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా 50 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 44,879 కొత్త వైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే, గత కొద్ది రోజులుగా క్రియాశీల కేసులు సంఖ్య ఐదు లక్షల మార్కు కంటే తగ్గడం ఊరట కలిగించే అంశం. 
 
గురువారం ఆ కేసులు సంఖ్య 4,84,547గా ఉంది. ఇది మొత్తం కేసుల్లో 5.63శాతాం. కోలుకున్న వారిశాతం 92.89 శాతంగా ఉంది. ఇక, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 87,28,795 మంది వైరస్ బారినపడగా, వారిలో 81,15,580 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు.
 
గురువారం ఒక్కరోజే కోలుకున్న వారి సంఖ్య 49,079గా ఉంది. ఈ మహమ్మారి కారణంగా గురువారం 547 మరణాల సంభవించగా, ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి 1,28,668 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, గత 24 గంటల్లో ప్రభుత్వం 11,39,230 నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది.

అన్నీ చూడండి

ఇండస్ట్రీలో త్రిష వంటి వ్యక్తులు చాలా అరుదు : మాళివికా మోహనన్

Screenplay Master' book: స్క్రీన్ ప్లే మాస్టర్ - సుకుమార్ పుస్తకం ఆవిష్కరణ

వైభవోపేతంగా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 10: తొలి అవతారంగా మహాపరీక్షను ప్రకటించిన నాగార్జున

Ranbali: విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా రణబాలి టీజర్ డేట్ ఫిక్స్

Priyadarshi : ప్రియదర్శి చిత్రం ఇడుపు కాయితం నుంచి శ్రీలత. సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments