Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

దేశంలో 2,202 మందికి పాజిటివ్‌.. ఉత్తర కొరియాలో కరోనా విజృంభణ

Written By సెల్వి
Updated: సోమవారం, 16 మే 2022 (13:18 IST)
దేశంలో కరోనా నియంత్రణలో వుంది. గత 24 గంటల్లో 2.97 లక్షల మందికి వైద్య పరీక్షలను నిర్వహించగా 2,202 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 2,550 మంది కరోనా నుంచి కోలుకోగా... 27 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రస్తుతం దేశంలో 17,317 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 5,24,241 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకు 4,25,82,243 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక భారత్‌లో ఇంతవరకు 1,91,37,34,314 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
 
ఇకపోతే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కానీ చైనా, ఉత్తర కొరియాల్లో కరోనా ప్రభావం అధికంగా వుంది. ముఖ్యంగా ఉత్తర కొరియాలో కరోనా మహమ్మారి విస్ఫోటం చెందింది. కఠిన లాక్ డౌన్‌లు పెట్టినా, క్వారంటైన్ రూల్స్‌ను అమలు చేసినా.. ఆ దేశంలోకి ఎంటరైన మూడు రోజుల్లోనే కేసులు లక్షలు దాటేశాయి. 
 
ఇప్పటిదాకా 8,20,620 కేసులు నమోదు కాగా.. బాధితుల్లో 3,24,550 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ మరో 15 మంది జ్వరం వల్ల చనిపోయారంటూ ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 42కు పెరిగింది. కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉండడంతో దేశమంతా లాక్ డౌన్ విధించింది 

అన్నీ చూడండి

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

Catherine Tresa : కరికాల చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్

Vijay Deverakonda Interview: మన ప్రజల ధైన్యం అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి : విజయ్ దేవరకొండ

Nani Bloody Romeo look :బ్లడీ రోమియో లో చెఫ్‌.. గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న నాని

తర్వాతి కథనం
Show comments