Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ప్రమాద ఘంటికలు... దేశ వ్యాప్తంగా 28 కేసులు

Written By ఠాగూర్
Updated: బుధవారం, 4 మార్చి 2020 (13:23 IST)
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఫలితంగా దేశవ్యాప్తంగా 28 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇందులో ఢిల్లీలో ఒక కేసు నమోదుకాగా, ఆగ్రాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా వైరస్ సోకినట్టు వెల్లడించారు. 
 
ఇకపోతే, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఒకటి, తెలంగాణాలో ఒకటి, కేరళలో మూడు, 16 మంది ఇటలీ వాసులు, ఒక భారతీయ డ్రైవర్‌కు ఈ వైరస్ సోకినట్టు మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. 
 
ముఖ్యంగా, ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన మరో 16 మందికి ఈ వైరస్‌ సోకినట్టుగా గుర్తించారు. వీరిలో ఒకరు భారతీయులు కాగా, 16 మందిని ఇటలీకి చెందిన వారుగా పేర్కొన్నారు. 
 
మొత్తం 21మంది పర్యాటకులు వైద్యుల పరిశీలనలో ఉన్నారు. వీరందరినీ ఎయిమ్స్‌లోని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కొత్త కేసులు గుర్తించడంతో భారతదేశంలో కరోనా వైరస్ భయాందోళనలు పెరుగుతున్నాయి. 

దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండటంతో అన్ని విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించినట్టు మంత్రి చెప్పారు.

అన్నీ చూడండి

Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Nani: న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్

Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !

Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

తర్వాతి కథనం
Show comments