Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో 163 కరోనా పాజిటివ్ కేసులు... దేశంలో?

Written By ఠాగూర్
Updated: గురువారం, 18 ఫిబ్రవరి 2021 (11:04 IST)
తెలంగాణలో కొత్త‌గా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. అదేసమయంలో 101 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,113 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,93,791 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,622 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,700 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 658 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 31 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.
 
దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 12,881 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 11,987 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,50,201కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 101 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,014కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,56,845 మంది కోలుకున్నారు. 1,37,342 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 94,22,228 మందికి వ్యాక్సిన్ వేశారు.
           
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 20,87,03,791 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,26,562 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

అన్నీ చూడండి

Chiranjeevi : జి.వి. నారాయణరావు అంత్యక్రియలకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి

Toxic Torture reson: టాక్సిక్ చిత్రం టార్చెర్ కు కారణం ఏమిటి ? రుక్మిణి వసంత్ పాత్రపై చర్చ

Varanasi rumors: వారణాసి ని మరిచిపోకుండా వదంతులతో ప్రచారం చేస్తున్నారా ?

Rakul Preet Singh: అందం, అహంకారం ఉన్న స్త్రీగా నటించడం గర్వంగా వుంది

Allari Naresh: రంభ ఊర్వశి మేనక స్టెప్ లేస్తే తెల్లారి వేడుక... సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments