Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి కోలుకున్నా తిప్పలు.. స్టెరాయిడ్స్‌తో కంటి చూపు గోవిందా!

Written By సెల్వి
Updated: శనివారం, 17 అక్టోబరు 2020 (13:02 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా బారిన పడి.. ఆపై కోలుకున్న వారిపై జరిపిన పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వైద్య నిపుణులు కరోనాను తగ్గించడానికి వాడే మందుల వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు చెప్పారు.
 
కరోనా చికిత్సలో భాగంగా వినియోగిస్తున్న స్టెరాయిడ్స్ వల్ల కోలుకున్న వారిలో కంటిచూపు మందగిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని స్టెరాయిడ్స్ లైఫ్ లాంగ్ సైడ్ ఎఫెక్ట్స్‌ను చూపిస్తూ ఉంటాయని పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత ఎలాంటి కంటి సమస్యలు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకొచ్చారు.
 
డయాబెటిస్, హైపర్ టెన్షన్ లాంటి వ్యాధులతో బాధ పడేవాళ్లకు స్టెరాయిడ్స్‌ను వినియోగిస్తే మరింత ప్రమాదమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కరోనా సోకిన వారిలో ఊపిరితిత్తుల సమస్యలు కనిపిస్తే స్టెరాయిడ్స్ ఇస్తారని.. ఆ స్టెరాయిడ్స్ భవిష్యత్తులో చాలా సైడ్ ఎఫెక్ట్స్‌ను చూపుతాయని వెల్లడించారు. స్టెయిరాడ్స్ తీసుకున్న వాళ్లు కంటి డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిదని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

అన్నీ చూడండి

Varun Tej : వాయువ్ ముఖాన్ని చూపిస్తూ అందమైన జీవితంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పోస్ట్

ఇరుముడి సైలెంట్ హిట్: పొంగిపోతున్న మాస్ మహరాజ రవితేజ, వీడియో

Epic movie review: బేబి జంట ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ సక్సెసా? కాదా? ఎపిక్ మూవీ రివ్యూ

అపుడు నటనకు పూర్తిగా స్వస్తి పలకాలని అనుకున్నాను : సమంత

బిగ్ బాస్ తెలుగులో బిగ్ ట్విస్ట్, ఏంటది?

తర్వాతి కథనం
Show comments